హత్యాయత్నం ఘటనలో ఐదుగురు అరెస్టు

హత్యాయత్నం ఘటనలో ఐదుగురు అరెస్టు కాకతీయ, కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణంలోని నెహ్రూ బస్తి ప్రాంతంలో వ్యక్తిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో ఐదుగురు నిందితులను కొత్తగూడెం వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 4వ తేదీన నరేష్ కోరి (40) అనే వ్యక్తిపై రైలు పట్టాల సమీపంలో దాడి జరగగా, కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు శనివారం నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించినట్లు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ తెలిపారు. నెహ్రూ బస్తిలోని రైలు పట్టాల వద్ద...