పీహెచ్‌సీలో ఉచిత వైద్య శిబిరం

పీహెచ్‌సీలో ఉచిత వైద్య శిబిరం కాకతీయ కరీంనగర్ : ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామాల్లో ఉచిత మెగా హెల్త్ క్యాంపులను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శనివారం కరీంనగర్ పట్టణంలోని కట్టారాంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిపుణుల ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. గైనకాలజీ, దంత వైద్యం, జనరల్ మెడిసిన్, శిశు వైద్యం, ఆర్థోపెడిక్, కంటి వైద్య విభాగాలకు...