ఘ‌నంగా మ‌హిళా దినోత్స‌వం

ఘ‌నంగా మ‌హిళా దినోత్స‌వం కాకతీయ, ఏటూరునాగారం : మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్ బాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు సంకల్పిస్తే సాధించలేనిది ఏదీ లేదని అన్నారు. ఆడపిల్లలు ఆత్మవిశ్వాసాన్ని ఆభరణంగా ధరించి ఉన్నత చదువులతో సమాజంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకోవాలని సూచించారు. మహిళా దినోత్సవం గుర్తుగా కళాశాల ప్రధాన ద్వారం ఎదుట సర్పంచ్ మొక్కలు నాటారు. ప్రతి విద్యార్థిని పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా తీసుకొని ప్రకృతిని...