“మహానటి”

"మహానటి" ** ఆమె ఒక గొప్ప నటి… ఎందుకంటే ఆమె నటన ప్రాణాలతో రాసిన నాటకం ఆస్కార్ అవార్డ్స్ ఎన్ని ఇచ్చినా సరే, ఆమె నటన ముందు అవన్నీ దిగదుడుపే . మనసులో అగ్నిపర్వతాలు బద్ధలవుతున్నా... బయటకి మంచుకొండలా నిలబడుతుంది. “నేను బానే ఉన్నా…” అనే మాట ఆమె జీవితంలోనే అత్యంత పెద్ద అబద్ధం. కాగితపు నవ్వు పులుముకుని సమాజపు వేదికనెక్కుతుంది. సభల్లో ఆమె స్వరం గర్జిస్తుంది — స్త్రీ సాధికారత, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం గురించి. ఆమె చెరగని మందస్మితం వెనుక అణచివేతకు గురైన...