హామీల అమలుపై నిలదీయాలి

హామీల అమలుపై నిలదీయాలి బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ కాకతీయ, కరీంనగర్ : కాంగ్రెస్ ప్రభుత్వం “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజులు” పేరుతో మరోసారి అబద్ధాలతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ విమర్శించారు. రెండు సంవత్సరాల క్రితం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పట్లో ప్రజాపాలన పేరుతో గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి ఆరు పథకాల పేరిట లక్షలాది దరఖాస్తులు స్వీకరించిందన్నారు. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు, ఇచ్చిన హామీలను మరిపించేందుకు...