సీఐటీయూలో చేరిన యువ కార్మికులు
సీఐటీయూలో చేరిన యువ కార్మికులు కాకతీయ, కొత్తగూడెం : కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేస్తూ ముందుండే సీఐటీయూ సంఘంలో యువ కార్మికులు చేరడం అభినందనీయమని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మందా నరసింహారావు, జిల్లా అధ్యక్షుడు కె బ్రహ్మచారి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ కేంద్రంగా నిర్వహించిన కార్యక్రమంలో హైట్ శివ ఆధ్వర్యంలో ముప్పై ఐదు మంది యువ కార్మికులు సీఐటీయూ సంఘంలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల హక్కులు, జీతాలు, కుటుంబాల...