జాతరలో తప్పిపోయిన చిన్నారి..
జాతరలో తప్పిపోయిన చిన్నారి.. తల్లికి అప్పగించిన పోలీసులు కాకతీయ, గీసుగొండ: కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతరలో తప్పి పోయిన ఓ చిన్నారిని పోలీసులు గుర్తించి సురక్షితంగా తల్లికి అప్పగించారు. గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం హసన్‌పర్తి మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన నన్నబోయిన శిరీష తన మూడు సంవత్సరాల కుమార్తె రియాన్స్‌తో కలిసి కొమ్మాల జాతరకు వచ్చింది. జాతరలో భక్తులు భారీగా తరలివచ్చిన నేపథ్యంలో కొంతసేపటికి చిన్నారి తల్లి వద్ద నుంచి తప్పిపోయింది. చిన్నారి కనిపించకపోవడంతో తల్లి ఆందోళనకు గురై...