బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ

బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ కొత్తగట్టులో మృతుల కుటుంబాలను ఓదార్చిన ఆరెపల్లి మోహన్ కాకతీయ, శంకరపట్నం: మండలంలోని కొత్తగట్టు గ్రామంలో ఇటీవల మృతిచెందిన ఎడ్ల రాజు, తనుకు స్వప్న, చల్ల బాబు రెడ్డి కుటుంబాలను మానకొండూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్ ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇలాంటి విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు. బాధిత కుటుంబాలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని భరోసా...