చెత్త సేకరణలో నిర్లక్ష్యం సరికాదు..!
చెత్త సేకరణలో నిర్లక్ష్యం సరికాదు..! తడి, పొడి, హానికర వ్యర్థాలు వేరు చేయాలి మండల పంచాయతీ అధికారి కూచన ప్రకాష్ కాకతీయ, రాయపర్తి : గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం సరికాదని మండల పంచాయతీ అధికారి కూచన ప్రకాష్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లక్ష్యాలను సాధించడంలో చెత్త నిర్వహణ కీలకమని పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని కాట్రపల్లి, కొలన్ పల్లి, కొత్తూరు గ్రామాల్లో పర్యటించిన ఆయన చెత్త సేకరణ, పారిశుధ్య పనులను పరిశీలించారు. మహిళా సంఘాలు, గ్రామ ప్రజలకు...