పోడు రైతులపై నిర్బంధాలు ఆపాలి..!

పోడు రైతులపై నిర్బంధాలు ఆపాలి..! పేదల సాగు భూములు స్వాధీనం చేయొద్దు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కాకతీయ, కొత్తగూడెం : పోడు సాగు చేస్తున్న గిరిజనులపై నిర్బంధాలు ఆపాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అటవీశాఖ అధికారులను కోరారు. అనాదిగా సాగుచేసుకుంటున్న పేదల భూములను స్వాధీనం చేసుకునే చర్యలకు స్వస్తి చెప్పాలని సూచించారు. లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని జిల్లా అటవీశాఖ అధికారి కార్యాలయంలో అటవీశాఖ అధికారులు, స్థానిక నాయకులు, పోడు రైతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనుల సమస్యలపై చర్చించారు. ఈ...