బైకు కొనివ్వలేదని విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య
బైకు కొనివ్వలేదని విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య కాకతీయ, కరీంనగర్ రూరల్ : బైకు కొనివ్వలేదన్న మనస్థాపంతో ఐటీఐ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కరీంనగర్ రూరల్ మండలంలో విషాదం నింపింది. మండలంలోని గోపాలపూర్ గ్రామానికి చెందిన సాయిని తిరుపతి కుమారుడు రిత్విక్ (17) ఐటీఐ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల తనకు బైకు కొనివ్వాలని తండ్రిని కోరగా, ప్రస్తుతం అప్పులు ఎక్కువగా ఉన్నాయని, పంట అమ్మిన తర్వాత డబ్బులు వచ్చిన వెంటనే కొనిస్తానని తండ్రి చెప్పాడు. అయితే తన స్నేహితులందరికీ బైకులు...