చీరెలో మెరిసిన నారీశక్తి
చీరెలో మెరిసిన నారీశక్తి మహిళా దినోత్సవానికి చేనేత దంపతుల ప్రత్యేక సృష్టి కాకతీయ, రాజన్న సిరిసిల్ల : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్లకు చెందిన చేనేత దంపతులు నేసిన ప్రత్యేక పట్టుచీర అందరి ప్రశంసలు అందుకుంటోంది. నారీశక్తి, మహిళల విజయాలను ప్రతిబింబించేలా రూపొందించిన ఈ చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చేనేత కళాకారులు హరిప్రసాద్, రేఖా దంపతులు మూడు నెలలపాటు శ్రమించి ఈ చీరను మగ్గంపై నేసారు. సంప్రదాయ చేనేత కళకు ఆధునిక ఆలోచనలను జోడిస్తూ మహిళల శక్తి, సహనం, సాధనలను ప్రతిబింబించేలా...