దివ్యాంగుల కొత్త పింఛన్ల నమోదు ప్రారంభం..!
దివ్యాంగుల కొత్త పింఛన్ల నమోదు ప్రారంభం..! అర్హులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి ఏటూరునాగారం సర్పంచ్ కాకులమర్రి శ్రీలత కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం గ్రామపంచాయతీ పరిధిలో అర్హులైన దివ్యాంగుల కోసం కొత్త పింఛన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైనట్లు సర్పంచ్ కాకులమర్రి శ్రీలత తెలిపారు. గ్రామంలోని ప్రతి అర్హుడికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించేందుకు ఈ ప్రక్రియ చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీలత మాట్లాడుతూ గ్రామంలోని వార్డు సభ్యులు తమ తమ వార్డుల్లో ఉన్న దివ్యాంగులను...