ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం -భవిష్యత్తులో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు -వ్యవసాయ అధికారి కే.వెంకటేష్ కాకతీయ, శంకరపట్నం: మండలంలోని మెట్‌పల్లి రైతు వేదికలో మంగళవారం రోజు ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి వెంకటేష్ మాట్లాడుతూ జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ (ఎన్ఎంఎన్ఎఫ్) పథకం కింద ఎంపికైన రైతులకు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయంగా పచ్చి రొట్ట ఎరువులు, జీవన ఎరువులు వినియోగించడం ద్వారా తక్కువ ఖర్చుతో నేల ఆరోగ్యాన్ని...