ఎంజీఆర్‌పై రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఎంజీఆర్‌పై రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు కాకతీయ, సినిమా: ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదానికి దారితీశాయి. హైదరాబాద్‌లో జరిగిన కళాప్రపూర్ణ కాంతారావు జాతీయ అవార్డు కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, దివంగత నటుడు కాంతారావు గొప్పతనాన్ని వివరించే సందర్భంలో తమిళనాడుకు చెందిన దిగ్గజ నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు విమర్శలకు గురవుతున్నాయి. కాంతారావు గారి జానపద చిత్రాలను చూసి ఎంజీఆర్ భయపడి ‘ఉచ్చ పోసుకునేవాడు’ అంటూ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి కేంద్రబిందువుగా మారాయి....