సావిత్రిబాయి పూలే సేవలు చిరస్మరణీయం
సావిత్రిబాయి పూలే సేవలు చిరస్మరణీయం కాకతీయ, హుజురాబాద్: పట్టణంలోని జ్యోతిబాపూలే కూడలిలో సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతిని హుజురాబాద్ పూలే కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పూలే కమిటీ అధ్యక్షుడు ఇప్పలపల్లి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పూలే కమిటీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ మహిళా విద్యాభివృద్ధి కోసం ఎన్నో అవమానాలు, విమర్శలు ఎదుర్కొంటూ సమాజంలో స్త్రీ విద్యకు నాంది పలికిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని పేర్కొన్నారు....