కవిత అరెస్ట్‌పై తెలంగాణ జాగృతి ఆగ్రహం
కవిత అరెస్ట్‌పై తెలంగాణ జాగృతి ఆగ్రహం కాకతీయ, కరీంనగర్: ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల భూ నిర్వాసితులకు మద్దతుగా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయడాన్ని తెలంగాణ జాగృతి నాయకులు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ జాగృతి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.వెలుగుమట్ల బాధితుల పక్షాన ఖమ్మంలోని అంబేద్కర్ భవన్‌లో దీక్ష ప్రారంభించిన కవితను మహిళా పోలీసులు లేకుండా అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించడం ప్రజాస్వామ్యానికి అవమానకరమని ఆయన అన్నారు. ముగ్గురు మంత్రులు...