మంత్రి పర్యటనలో ఉద్రిక్తత
మంత్రి పర్యటనలో ఉద్రిక్తత అంబేద్కర్ భవనం పూర్తి చేయాలంటూ దళిత సంఘాల ఆందోళన కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలో రాష్ట్ర మంత్రి పొన్న ప్రభాకర్ పర్యటన సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఏళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయిన అంబేద్కర్ భవన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని దళిత సంఘాల నాయకులు మంత్రిని కోరుతూ వినతిపత్రం అందజేశారు.హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా ప్రభుత్వం – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమానికి మంత్రి పొన్న ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.కార్యక్రమం ముగిసిన అనంతరం...