సంచార జాతుల సమగ్ర సర్వే పుస్తకం ఆవిష్కర‌ణ‌

సంచార జాతుల సమగ్ర సర్వే పుస్తకం ఆవిష్కర‌ణ‌ కాకతీయ, కరీంనగర్ : సంచార, అర్థసంచార, విముక్త జాతుల ఆర్థిక–సామాజిక స్థితిగతులపై నిర్వహించిన సమగ్ర సర్వే ఆధారంగా రూపొందించిన పుస్తకాన్ని కరీంనగర్ మేయర్ కోలగని శ్రీనివాస్ బుధవారం ఆవిష్కరించారు. సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సర్వే దేశంలోనే తొలి ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సంచార జాతుల జీవన పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేసి పుస్తకరూపంలో తీసుకురావడం అభినందనీయమన్నారు. ఈ పుస్తకం ద్వారా ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ యంత్రాంగానికి,...