ప్రగతి విద్యాలయంలో ఘనంగా ఫేర్వెల్ డే

ప్రగతి విద్యాలయంలో ఘనంగా ఫేర్వెల్ డే ఆటపాటలతో సందడి చేసిన విద్యార్థులు కాకతీయ, కూసుమంచి: మండల కేంద్రంలోని ప్రగతి విద్యాలయంలో పదవ తరగతి విద్యార్థులకు ఘనంగా ఫేర్వెల్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. తొమ్మిదో తరగతి విద్యార్థులు తమ సీనియర్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పదవ తరగతి విద్యార్థులకు స్మరణీయమైన వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కొక్కిరేణి సీతారాములు మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలు పెట్టుకుని...