మెట్పల్లి గ్రామంలో దొంగల బీభత్సం..
మెట్పల్లి గ్రామంలో దొంగల బీభత్సం.. -భయాందోళనలో గ్రామస్తులు -ఇంటికి తాళాలు వేసిన ఇల్లే టార్గెట్ -రాత్రిపూట పోలీస్ గస్తీ పెంచాలంటూ డిమాండ్ కాకతీయ, శంకరపట్నం: మండలంలోని మెట్పల్లి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు పడ్డ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ నెల 5వ తేదీన మొలంగూర్ గ్రామంలో దొంగతనం జరిగి వారం రోజులు కూడా గడవకముందే మళ్లీ మెట్పల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకోవడం ప్రజల్లో భయాందోళనలకు కారణమైంది. గ్రామంలోని సుమారు 7 ఇళ్లలో గుర్తుతెలియని దొంగలు తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించినట్లు...