వార్డుల్లో పారిశుద్ధ్య చర్యలు హోటళ్లపై తనిఖీలు
వార్డుల్లో పారిశుద్ధ్య చర్యలు హోటళ్లపై తనిఖీలు కాకతీయ, హుజురాబాద్ : ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి నివేదిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలో బుధవారం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని 10, 17, 21, 23, 27 వార్డుల్లో మున్సిపల్ సిబ్బంది మురికికాలువలు, చెత్త చెదారాన్ని తొలగించి శుభ్రపరిచారు. పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడేలా చర్యలు చేపట్టారు.అదే సమయంలో పట్టణంలోని హోటళ్లు, భోజనశాలలను అధికారులు తనిఖీ చేసి పరిశుభ్రత ప్రమాణాలను పరిశీలించారు.మున్సిపల్ డంపింగ్ యార్డులోని డ్రై రిసోర్స్ కలెక్షన్...