నీటి కోసం రోడ్డెక్కిన టీఆర్‌కే నగర్ వాసులు

నీటి కోసం రోడ్డెక్కిన టీఆర్‌కే నగర్ వాసులు ఆరు రోజులుగా నీటి సరఫరా నిలిచివేత కాలనీవాసుల ఆందోళన కాకతీయ, కరీంనగర్ / చింతకుంట : కరీంనగర్ నగరంలోని చింతకుంట పరిధిలోని 15వ డివిజన్ టీఆర్‌కే నగర్ కాలనీలో గత ఆరు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీరు అందక కాలనీవాసులు రోజువారీ అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. స్థానికుల వివరాల ప్రకారం, బీఎస్ఎన్ఎల్ చేపడుతున్న అండర్‌గ్రౌండ్ పైపింగ్ పనుల సమయంలో నీటి పైపులు పలు చోట్ల దెబ్బతిని...