కూసం రాజమౌళి కాంస్య విగ్రహ ఏర్పాటుకు అఖిలపక్ష కమిటీ
కూసం రాజమౌళి కాంస్య విగ్రహ ఏర్పాటుకు అఖిలపక్ష కమిటీ కాకతీయ, గీసుగొండ: దేశం గర్వించేలాగా గంగాదేవిపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దిన జాతీయ ఆదర్శ గ్రామ మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి స్మారకార్థం గ్రామంలో ఆయన కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో గీసుగొండ మండలం గంగాదేవిపల్లి గ్రామంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ అధ్యక్షుడిగా కూసం రమేష్‌ను ఎంపిక చేయగా, సభ్యులుగా గోనె కుమారస్వామి, సోమిరెడ్డి శీను, ఆకుల రుద్ర ప్రసాద్, గోనె మలయ్య, గోనె...