ఎస్సీ నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు

ఎస్సీ నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు కాకతీయ, పెద్దపల్లి : రామగుండం నియోజకవర్గంలో నివసించే షెడ్యూల్డు కులాల నిరుద్యోగ యువతీ, యువకులకు దుకాణాల కేటాయింపునకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. పెద్దపల్లి జిల్లా షెడ్యూల్డు కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో రామగుండం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో నిర్మించిన దుకాణ సముదాయాన్ని అద్దెపై కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు స్వయం ఉపాధి కోసం వ్యాపారాలు ప్రారంభించేందుకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు ఫారంలు కలెక్టర్ కార్యాలయంలోని...