రాజాపూర్‌లో వ‌డ‌గండ్ల వాన

రాజాపూర్‌లో వ‌డ‌గండ్ల వాన పిడుగుపాటు.. త‌ప్పిన ప్రాణనష్టం కాకతీయ, శంకరపట్నం: మండలంలోని రాజాపూర్ గ్రామంలో వ‌డ‌గండ్ల వాన భీభ‌త్సం సృష్టించింది. మంగళవారం రాత్రి భారీ వర్షంతోపాటు పిడుగు పడ‌టంతో స్థానికులు భయాందోళనకు గుర‌య్యారు. రాత్రి నుండి తెల్లవారుజాము వరకు వర్షం కొనసాగింది. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో వాతావరణం మారిపోయింది. గ్రామ స‌మీపంలోని కొబ్బరి చెట్టుపై పిడుగు పడగా అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని గ్రామస్తులు తెలిపారు. దీంతో కొంతసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. పిడుగుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బహిరంగ...