మౌలిక వసతులు క‌ల్పించాలి

మౌలిక వసతులు క‌ల్పించాలి కాకతీయ,ఖిలా వరంగల్: ఖిలా వరంగల్ మండలంలోని 37, 38 డివిజన్లలో నెలకొన్న పలు ప్రధాన సమస్యలపై భారతీయ జనతా పార్టీ నాయకులు బుధవారం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మండల అధ్యక్షుడు తాళ్లపల్లి అర్జున్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక సమస్యలను పరిశీలించి తక్షణ పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. 37వ డివిజన్‌లోని ఎస్సీ కాలనీ శ్మ‌శానవాటిక దయనీయ స్థితిలో ఉండడం ప్రధాన సమస్యగా నిలిచింది. కనీస సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. స్నానం చేయడానికి...