మెట్టుగుట్టపై వైభవంగా ఆధ్యాత్మిక వేడుకలు
మెట్టుగుట్టపై వైభవంగా ఆధ్యాత్మిక వేడుకలు రామలింగేశ్వర స్వామికి రుద్రాభిషేకం హుండీని బహూకరించిన భక్తులు కాకతీయ, కాజీపేట: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం, అభిషేకం కల్పించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్. సత్యనారాయణ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించడం ఆనందకరమన్నారు. వరంగల్ మహా నగరంలోని దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన మెట్టుగుట్టపై గల శ్రీ సీతారామచంద్ర స్వామి మరియు శ్రీ మెట్టురామలింగేశ్వర స్వామి దేవస్థానాల్లో గురువారం ఉదయం రుద్రాభిషేకం నిర్వహించి అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. రామాలయంలో...