ప్రజా వంచనతో నిండిన బడ్జెట్
ప్రజా వంచనతో నిండిన బడ్జెట్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాదగిరి సునీల్ రావు కాకతీయ, కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ హామీలకు విరుద్ధంగా ఉందని, ఇది ప్రజా ప్రయోజనాల కంటే అంకెల గారడీతో నిండిన బడ్జెట్ మాత్రమేనని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాదగిరి సునీల్ రావు విమర్శించారు. రైతు భరోసా, నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సాయం వంటి కీలక హామీలు బడ్జెట్‌లో కనిపించకపోవడం నిరాశ కలిగించిందన్నారు. గత ఏడాది బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి కూడా పెద్ద...