రంజాన్ సోదరభావానికి ప్రతీక
రంజాన్ సోదరభావానికి ప్రతీక పండుగను ఐక్యతతో జరుపుకోవాలి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గుండాల కృష్ణ కాకతీయ, ఖమ్మం: ముస్లిం సోదరుల పెద్ద పండుగ రంజాన్‌ను ఆనందోత్సవాల నడుమ జరుపుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గుండాల కృష్ణ, సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్, నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు అన్నారు. ఈ పండుగ మానవాళికి శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు మానవాళి సుఖశాంతుల కోసం ప్రార్థనలు చేయాలని ఆకాంక్షించారు. త్రీ టౌన్ ప్రాంతంలోని 32వ డివిజన్‌లో...