శ్రీరామనవమి కళ్యాణ గోడపత్రిక ఆవిష్కరణ

శ్రీరామనవమి కళ్యాణ గోడపత్రిక ఆవిష్కరణ కాకతీయ, కారేపల్లి : శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు అర్చకులు రవీందర్ సురేష్ స్వామీజీలు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. కొత్తూరుతండాలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో కళ్యాణ మహోత్సవ గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 27వ తేదీ ఉదయం ధ్వజారోహణ, భోగి బండారో, మధ్యాహ్నం 12:05 గంటలకు సీతారాముల కళ్యాణం, అనంతరం అన్నదానం, సాయంత్రం చక్రస్థానం, ధ్వజావరోహణ, ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో చిన్నమడం పల్లి...