రంజాన్ వేడుకల్లో కుడా చైర్మన్ ఇనుగాల
రంజాన్ వేడుకల్లో కుడా చైర్మన్ ఇనుగాల కాకతీయ, హనుమకొండ : పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి పరకాల పట్టణంలోని ముస్లిం సోదరులకు హృదయపూర్వకంగా ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ పండుగ మానవాళికి శాంతి, ప్రేమ, త్యాగం వంటి గొప్ప విలువలను తెలియజేస్తుందని పేర్కొన్నారు. ముస్లిం సోదరులు నెల రోజుల పాటు భక్తిశ్రద్ధలతో ఆచరించే ఉపవాస దీక్షలు సమాజంలో క్రమశిక్షణను పెంపొందించడమే కాకుండా,...