మైనారిటీల‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వం పెద్ద‌పీట‌

మైనారిటీల‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వం పెద్ద‌పీట‌ ముస్లింలకు ఇందిర‌మ్మ ఇళ్లు కేటాయిస్తాం రంజాన్ ప్రార్థనల్లో ఎమ్మెల్యే మాధవరెడ్డి కాకతీయ, నర్సంపేట టౌన్ : రంజాన్ పండుగను పురస్కరించుకుని నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్ శివారులోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు.ముస్లిం మత పెద్దల ఆహ్వానం మేరకు హాజరైన ఎమ్మెల్యే, రంజాన్ మాసంలో పాటించే ఉపవాసాలు, ప్రార్థనలు మనసును పవిత్రం చేసి మంచి మార్గంలో నడిపిస్తాయని పేర్కొన్నారు....