ఘనంగా ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు

ఘనంగా ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు కాకతీయ,రాయపర్తి : మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) పండుగ సంబరాలు మిన్నంటాయి.శనివారం ఈ పండుగను ముస్లిం సోదరులు ఎంతో భక్తిశ్రద్ధలతో,ఉత్సాహంగా జరుపుకున్నారు. నెల రోజుల పాటు ఆచరించిన కఠిన ఉపవాస దీక్షలు ఈద్-ఉల్-ఫితర్ పండగతో ముగిసాయి.ఉదయాన్నే ముస్లిం సోదరులందరూ నూతన వస్త్రాలు ధరించి ఈద్గాకు చేరుకున్నారు.ఈ నేపథ్యంలో మతగురువుల నేతృత్వంలో ప్రత్యేక ప్రార్థనలు (సలాత్ అల్-ఈద్) నిర్వహించారు.చిన్న పెద్ద అంతా కలిసి భారీ సంఖ్యలో పాల్గొనడంతో ఈద్గా మైదానాలు కళకళలాడాయి.ప్రార్థనలు ముగిసాక ఒకరినొకరు ఆలింగణం...