ముస్లింలకు ప్రభుత్వ తోఫా
ముస్లింలకు ప్రభుత్వ తోఫా ఇల్లంతకుంటలో నూతన వస్త్రాల పంపిణీ కాకతీయ, జమ్మికుంట/ ఇల్లంతకుంట : ఇల్లంతకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మహిళలకు అందజేస్తున్న నూతన వస్త్రాలను ఇల్లంతకుంట దేవస్థానం చైర్మన్ ఇంగిలే రామారావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరీమణులకు నూతన వస్త్రాలు అందించడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రభుత్వం అన్ని...