భీమన్నను దర్శించుకున్న ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి
భీమన్నను దర్శించుకున్న ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి కాకతీయ, వేములవాడ : వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని మల్టీ జోన్–1 ఐజీపీ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి (ఐపీఎస్) శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఐజీపీ గారికి ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి మండపంలో అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఎల్. రమాదేవి స్వామివారి శేషవస్త్రం కప్పి...