అంబాల్‌పూర్‌లో అభివృద్ధి పనుల పరిశీలన

అంబాల్‌పూర్‌లో అభివృద్ధి పనుల పరిశీలన కాకతీయ,శంకరపట్నం : మండలంలోని అంబాల్‌పూర్ గ్రామంలో చేపట్టనున్న అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించేందుకు శనివారం అధికారులు గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో సీసీ రోడ్లు, పనుల అమలు విధానంపై వివరాలు తెలుసుకునేందుకు డిఆర్డిఓ వి. శ్రీధర్ విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు వీధులను పరిశీలించిన ఆయన, సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించి అధికారులకు, కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. పనులను నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, నిర్దిష్ట గడువులో పూర్తిచేయాలని ఆదేశించారు. గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు...