నూతన ట్రాన్స్‌ఫార్మర్ల ప్రారంభం

నూతన ట్రాన్స్‌ఫార్మర్ల ప్రారంభం లో-వోల్టేజ్ సమస్యల నివారణకు చర్యలు కాకతీయ, నర్సంపేట టౌన్ : నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. 10వ, 26వ వార్డుల్లో నూతన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను శనివారం మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం లక్ష్మీ రామానంద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి సహకారం అందించారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ గృహ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ డిమాండ్ కూడా అధికమవుతోందన్నారు. పాత ట్రాన్స్‌ఫార్మర్లపై భారం పెరగడంతో లో-వోల్టేజ్ సమస్యలు తలెత్తుతున్నాయని, వాటిని నివారించేందుకు కొత్త...