భద్రకాళి అమ్మవారికి లక్ష ఫుష్పార్చ‌న‌

భద్రకాళి అమ్మవారికి లక్ష ఫుష్పార్చ‌న‌ మూడో రోజుకు చేరుకున్న వసంత నవరాత్ర మహెూత్సవాలు కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానంలో వసంత నవరాత్ర మహెూత్సవములు నేటితో మూడవ రోజుకు చేరుకున్నాయి. మూడవ రోజు కార్యక్రమాలలో భాగంగా ఉదయం సుప్రభాత సేవ, నిత్యాహ్నికం జరుపడిన పిమ్మట కల్పోక్త ప్రకారం వసంత నవరాత్ర ఉత్సవాల సందర్భంగా జరుపవలసిన విశేష జపహెూమార్చనాభిషేకములు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి లక్ష మల్లె పూలతో అర్చన జరిపి అమ్మవారికి నివేదనలు సమర్పించి భక్తులకు ప్రసాద...