సౌభ్రాతృత్వానికి ప్రతీకగా రంజాన్ వేడుకలు
సౌభ్రాతృత్వానికి ప్రతీకగా రంజాన్ వేడుకలు అమీనాబాద్ మదీనా మసీదులో ఘనంగా నిర్వహణ కాకతీయ,చెన్నారావుపేట : చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామంలోని మదీనా మసీదులో రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. పండుగ సందర్భంగా మసీదు ప్రాంగణం సోదరభావంతో కళకళలాడింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బాల్నె వెంకన్న ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగ త్యాగం, దయ, శాంతికి ప్రతీక అని పేర్కొన్నారు. మతాలు వేరైనా మానవత్వం ఒక్కటేనని,...