రంజాన్ సోదరభావానికి ప్రతీక
రంజాన్ సోదరభావానికి ప్రతీక భిన్నత్వంలో ఏకత్వమే భారతీయ సంస్కృతి రంజాన్ ప్రేత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే కూనంనేని కాకతీయ, కొత్తగూడెం : రంజాన్ పర్వదినం క్రమశిక్షణకు, సోదరభావానికి ప్రతీక అని, ఈ పండుగ సమాజంలో శాంతిని వెల్లివిరియజేస్తుందని, రంజాన్ కేవలం ముస్లిం సోదరుల పండుగే కాకుండా సమస్త మానవాళికి ఒక సందేశమని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని శనివారం నియోజకవర్గ పరిధిలోని పలు మసీదులు, ఈద్గాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక...