శ్రీరామనవమి ఉత్సవాలకు ఘన ఆహ్వానం

శ్రీరామనవమి ఉత్సవాలకు ఘన ఆహ్వానం కాకతీయ,శంకరపట్నం : మండలంలోని అంబాల్‌పూర్ గ్రామంలో ఈనెల 27న జరగనున్న శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ సందర్భంగా అంబాల్‌పూర్ హనుమాన్ భక్తమండలి పాలకవర్గ సభ్యులకు నిర్వాహకులు అధికారిక ఆహ్వానం అందజేశారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, భజనలు, అన్నదానం వంటి కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సవాలను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ...