“నేను ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్టే”
“నేను ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్టే” జీవన్ రెడ్డి పోస్టర్‌తో జగిత్యాలలో హీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పోస్టర్ కాకతీయ, జగిత్యాల: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన క్షణాల వ్యవధిలోనే మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి ముందు వెలసిన పోస్టర్ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. సినీ నటుడు రజనీకాంత్ ప్రసిద్ధ డైలాగ్ “నేను ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్టే”తో జీవన్ రెడ్డి ఫోటో కలిపిన ఈ పోస్టర్ స్పష్టమైన రాజకీయ సందేశంగా నిలిచింది. పోస్టర్ బయటపడిన వెంటనే దాని...