లక్ష గులాబీ పూలతో అమ్మవారికి అర్చన
లక్ష గులాబీ పూలతో అమ్మవారికి అర్చన కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానంలో వసంత నవరాత్ర మహెూత్సవములు నాలుగవ రోజుకు చేరుకున్నాయి. నాల్గవ రోజు కార్యక్రమాలలో భాగంగా ఉదయం సుప్రభాత సేవ, నిత్యాహ్నికం జరుపడిన పిమ్మట కల్పోక్త ప్రకారం వసంత నవరాత్ర ఉత్సవాల సందర్భంగా జరుపవలసిన విశేష జప హోమార్చనాభిషేకములు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి లక్ష గులాబీ పులతో లక్షపుష్పార్చన జరిపి అమ్మవారికి నివేదనలు సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ జరిపారు. నేడు లక్షపుష్పార్చన కార్యక్రమానికి...