వైభవంగా ఉగాది ఉత్సవాలు
వైభవంగా ఉగాది ఉత్సవాలు కళాకారుల ప్రతిభకు వేదిక టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు కాకతీయ, కొత్తగూడెం : పాల్వంచ పట్టణంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి కవులు, కళాకారులు పాల్గొని ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని వేణుగోపాల్ థియేటర్ ప్రాంగణంలో పాల్వంచ కళా పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ తెలుగు సంవత్సర ఉగాది వేడుకల చివరి రోజు కార్యక్రమాలు జరిగాయి. ముఖ్య అతిథులుగా...