ములుగు కోర్టుకు బాంబు బెదిరింపు

ములుగు కోర్టుకు బాంబు బెదిరింపు కాకతీయ, ములుగు ప్రతినిధి:ములుగు జిల్లా కోర్టులో బాంబు ఉన్నట్లు వచ్చిన సమాచారంతో ఒక్కసారిగా జిల్లా కేంద్రంలో తీవ్ర కలకలం రేపింది. న్యాయ వ్యవస్థకు కేంద్రమైన కోర్టు ప్రాంగణంలో ఈ వార్త బయటకు రావడంతో ప్రజలు, న్యాయవాదులు భయాందోళనలకు గురయ్యారు.వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమై, కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించారు. ఎవరూ లోపలికి వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. కొద్ది నిమిషాల్లోనే కోర్టు పరిసరాలు పోలీసు బందోబస్తుతో నిండిపోయాయి.డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగి...