గిరివాణికి ఫిర్యాదుల వెల్లువ

గిరివాణికి ఫిర్యాదుల వెల్లువ అర్జీలు వెంటనే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ఇంచార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ దివాకర కాకతీయ, ఏటూరునాగారం : గిరిజన సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన గిరివాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులను ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ ఏటూరునాగారం సమావేశ మందిరంలో ప్రజావాణి–గిరివాణి కార్యక్రమం జరిగింది. కలెక్టర్ స్వయంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. గిరివాణికి 130, ప్రజావాణికి 52 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు....