అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్‌లో ఎన్సీసీ శిబిరం

అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్‌లో ఎన్సీసీ శిబిరం కాకతీయ, కరీంనగర్ /కొత్తపల్లి : విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, బాధ్యతాయుత భావన పెంపొందించాలనే ఉద్దేశంతో అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో నిర్వహిస్తున్న ఎన్సీసీ శిబిరం కొనసాగుతోంది. గత రెండు రోజులుగా జరుగుతున్న ఈ శిబిరంలో పాల్గొంటున్న కెడెట్లతో అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు నైతిక విలువలను అర్థం చేసుకుని వాటిని ఆచరణలో పెట్టాలని సూచించారు. విధేయత, ఏకాగ్రత, పరస్పర సహకారం...