తాడికల్‌లో “ప్రజా బాట” కార్యక్రమం
తాడికల్‌లో “ప్రజా బాట” కార్యక్రమం రైతులకు విద్యుత్ భద్రతపై అవగాహన కాకతీయ,శంకరపట్నం : మండలంలోని తాడికల్ గ్రామంలో మంగళవారం రోజు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో “ప్రజా బాట” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులు గ్రామంలో పర్యటిస్తూ రైతులకు విద్యుత్ వినియోగం, భద్రతపై అవగాహన కల్పించారు. వ్యవసాయానికి విద్యుత్ అత్యంత కీలకమని పేర్కొంటూ, నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. వ్యవసాయ బావుల వద్ద ఇనుప డబ్బాలు వినియోగించడం ప్రమాదకరమని, వాటి స్థానంలో ప్లాస్టిక్ బాక్స్‌లు ఉపయోగించాలని సూచించారు....