సేంద్రీయ పద్ధతిలో కూరగాయల సాగు చేయాలి

సేంద్రీయ పద్ధతిలో కూరగాయల సాగు చేయాలి.. *జిల్లా కలెక్టర్ డా. సత్య శారద కాకతీయ,గీసుగొండ:సేంద్రీయ విధానంలో కూరగాయల సాగు చేయాలని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద రైతులకు సూచించారు.మండలంలోని కొనాయిమాకుల రైతువేదికలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా పలువురు రైతులకు 100 శాతం రాయితీపై ఉచితంగా ఐదు రకాల కూరగాయల మినీ కిట్స్‌ను పంపిణీ చేశారు.ఈ కిట్లలో టమాటా,పచ్చి మిరప, బెండ, తోటకూర,పాలకూర విత్తనాలు అందజేశారు.అనంతరం రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ మార్కెట్లో డిమాండ్ ఉన్న బీన్స్,బోడ కాకర, బ్రకోలీ, పొట్లకాయ వంటి తీగజాతి...